
ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: కాణిపాక వరసిద్ధుని వార్షిక బ్రహ్మోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని ఈవో పెంచలకిషోర్, ఏఎస్పీ నందకిషోర్ పిలుపునిచ్చారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ఆవరణలో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని శాఖల అధికారులు కలిసి మాక్ డ్రిల్ చేపట్టారు. దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయం లోపలి భాగంలో ఏదైనా జరిగితే... వారిని ఎలా ఆస్పత్రికి చేర్చాలి, అగ్నిప్రమాదం జరిగితే ఏవిధంగా స్పందించాలి, ఏ రకంగా మంటలను అదుపు చేయాలనే విషయంపై ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అధికారులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా వ్యహరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, ఆర్‌ఐ సుధాకర్, ఎస్‌ఐ నరసింహులు, కానిస్టేబుల్ మధు, అగ్నిమాపక, వైద్యాశాఖ, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.