● గంటల తరబడి రోడ్డుపై బైఠాయింపు ● ట్రాఫిక్ జామ్‌తో అవస
బ్యానర్లు చించేశారని తమ్ముళ్ల ఆందోళన
చౌడేపల్లె : ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యానర్లు ఎవరో చింపేశారని తమ్ముళ్లు ఆదివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇటీవల మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మండల పర్యటనలో భాగంగా ఆ పార్టీ నాయకులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిని ఎవరో చింపివేశారని న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని నాయకులకు సర్ధిచెప్పడానికి యత్నించినా ఆయన మాటలను ఖాతరు చేయకుండా హంగామా చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.


