పోలీసు గ్రీవెన్స్‌కు 55 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 36 వినతులు అందాయి. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్‌రాజు స్థానిక ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి త గాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యా దులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.
పదో తరగతి ఫలితాలు రేపు
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తారని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారన్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు bre.ap.gov.in మనమిత్ర వాట్సా ప్, లీప్ యాప్‌లలో చూసుకునేలా వెసులుబాటు కల్పించారన్నారు. వాట్సాప్‌లో 95523 00009 నంబర్‌కు ఏజీ (హాయ్) అని మెసేజ్ పంపి రోల్ నంబర్ నమోదు చేస్తే ఫలితాల పీడీఎఫ్‌ను పొందవచ్చని డీఈఓ వెల్లడించారు.


