● అందరూ 15 ఏళ్లలోపు వారే ● అలిపిరి, శ్రీవారి మెట్టు మార
అలిగి తిరుమలకు చేరుతున్న బాలురు
పలమనేరు : పిల్లలు చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తిరుమల కొండ చేరుతున్నారు. తాజాగా పలమనేరు మండలం టి.వడ్డూరుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి బంగారుపాళెం ఎస్సీ హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. హాస్టల్ వార్డెన్లు తిరుమలలో పది రోజులు గాలించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇల్లు చేరాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల మంది పిల్లలు తిరుపతి, తిరుమలలో ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు సమీపంలోని టి.వడ్డూరు, గొబ్బిళ్లకోటూరు గ్రామాలకు చెందిన 15 ఏళ్లలోపు వారే పదుల సంఖ్యలో తిరుమలలో ఉన్నట్లు తెలిసింది. కొందరు తల్లిదండ్రులు వెతికి పట్టుకొస్తుండగా.. మరికొందరు కొండపైనే చిరువ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం.
మెట్లదారుల్లో చిన్నపాటి అమ్మకాలు
తిరుమలకు వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రాంతాలు పిల్లలకు ఆవాసాలుగా మారాయి. అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారు పిల్లలతో పని చేయించుకుని కొంత కమీషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా నడకదారుల్లో పచ్చిమామిడి కాయలు, జామకాయలు, వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు. మరికొందరు భక్తులకు తిరునామాలు పెట్టి వారిచ్చినంత పుచ్చుకుంటున్నారు. మరికొందరు హోటళ్లలో దినసరి కార్మికులుగా పనిలో ఉంటున్నారు. అక్కడి యాత్రికుల మధ్య ఈ బాలురు ఆలయానికి వెళ్తున్నారా లేదా అక్కడ ఏమి చేస్తున్నారో గుర్తించడం కష్టంగా మారుతోంది. పలమనేరు సమీపంలోని టి.వడ్డూరు, గొబ్బిళ్లకోటూరు, బైరెడ్డిపల్లి, వి.కోట మండలాలకు చెందిన గ్రామాలు, బంగారుపాళెం మండలంలోని కొన్ని గ్రామాల నుంచి పిల్లలు ఎక్కువ మంది తిరుమల కొండపై ఉన్నట్టు తెలుస్తోంది.
రాత్రుళ్లు వీరి ఆవాసాలెక్కడంటే..
ఇంటి నుంచి అలిగి తిరుమల చేరిన పిల్లలు రాత్రిళ్లు సీఆర్వో కార్యాలయం, బాలాజీ బస్టాండు, సీఆర్వో వెనుక వైపునున్న యాత్రికుల వసతి నిలయాలు, కళ్యాణకట్ట ముందున్న ప్రాంతం, హెచ్‌పీటీఎల్ తదితర ప్రాంతాల్లో నిద్రిస్తున్నట్లు సమాచారం. అక్కడి స్నానపు గదులను ఉపయోగించుకోవడం, భక్తులు పెట్టే భోజనాలు తినడం మళ్లీ పగలు పెట్టుబడిలేని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ గడుపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎవరూ పట్టించుకోనివారు, తల్లిదండ్రులపై అలిగిన వారు ఇక్కడికి చేరుతున్నట్లు సమాచారం. తిరుమలలో విజిలెన్స్, పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచితేగాని పిల్లలను పట్టుకోవడం కష్టమే. చదువుకోవాల్సిన వయసులో బాల కార్మికులుగా మారుతున్న చిన్నారులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కిక్కిరిసిన బోయకొండ
● పెరిగిన భక్తుల రద్దీ ● ఆలయానికి రూ.11.98 లక్షల ఆదాయం
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన మండలంలోని బోయకొండ గంగమ్మతల్లి దీవెనల కోసం భక్తులు బోయకొండకు ఆదివారం తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయంవద్ద భక్తులకు విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా ఆలయానికి రూ.11.98 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపా రు. వీటితో పాటు అన్నదానం నిర్వహణకు రూ.25 వేలు భక్తులు విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు.
● అందరూ 15 ఏళ్లలోపు వారే ● అలిపిరి, శ్రీవారి మెట్టు మార


