కూటమి దురాగతాలను ఎండగట్టాలి
వెదురుకుప్పం: కూటమి దురాగతాలను ఎండగట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆళ్లమడుగులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పది నెలలుగా సూపర్‌సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని దౌర్భాగ్య పర్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. పథకాలను అమలు చేయాలని అడిగితే అక్రమ కేసులతో అణచివేతకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తానే తప్పు చేస్తూ ప్రతిపక్ష పార్టీపై నెట్టి వారిపైనే నిందలు, అభాండాలు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచకాలకు హద్దుల్లేవన్నారు. పేదల ఉసురు తగిలితే ఎలాంటి పార్టీ అయినా కోలుకోలేదన్నారు. రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దురాగతాలను ఎండగట్టేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల తలరాతలు మారాలంటే మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీ సభ్యురాలు రమణమ్మ, కో–ఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కామసాని పద్మనాభరెడ్డి, మండల ఉపాధ్యక్షులు చిరంజీవిరెడ్డి, గోవిందన్, కార్యదర్శులు బొజ్జారెడ్డి, కేశవులు, వెంకటేశ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పురుషోత్తం పాల్గొన్నారు.
–మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి


