● జేసీకి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ వినతి
అంబేడ్కర్ భవనాన్ని ఇప్పటికై నా నిర్మించరూ!
పలమనేరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నివాళుర్పించడం కాదు..ఆయన పేరిట పలమనేరులో భవన నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావాలని పలమనేరు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ నేతలు సోమవారం జిల్లా కేంద్రంలోని జేసీ విద్యాధరిని కలిసి కోరారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్ భవనం కోసం రెండు దశాబ్దాలపాటు పోరాటం చేస్తే గతంలో దండుమిట్ట వద్ద 46 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. అప్పట్లో నిధులు మంజూరైనా పనులు మొదలుకాక ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగానే ఉందని ఆమె దృష్టికి నివేదించారు. అక్కడ భవనం నిర్మిస్తే నియోజవర్గంలోని 37వేల మంది ఎస్సీ, ఎస్టీల శుభకార్యాలు, వివాహాలు, సమావేశాలకు అనువుగా ఉంటుందని తెలియజేశారు. జేసీని కలిసిన వారిలో పుష్పరాజ్, జయరామ్ తదితరులున్నారు.
ఒంటరి ఏనుగు వీరంగం
పులిచెర్ల(కల్లూరు): పులిచెర్ల మండలంలో నెల రోజులుగా రైతన్నలకు కంటికి కునుకు లేకుండా చేస్తున్న ఒంటరి ఏనుగు సోమవారం తెల్లవారుజామున సైతం వీరంగం సృష్టించింది. కమ్మపల్లె పంచాయతీ దిన్నెపాటిలో పంటలకు నష్టం కలిగించింది. మామిడి చెట్లను విరిచేయడంతోపాటు డ్రిప్ పరికరాలను ధ్వంసం చేసింది. అటవీ శాఖ అధికారులు కూడా దీనిని కట్టడి చేయడంలో చేతులెత్తేసున్నారని రైతులు లబోదిబోమంటున్నారు.
● జేసీకి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ వినతి


