ఆశయాలు ప్రతి పల్లెకు తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

ఆశయాలు ప్రతి పల్లెకు తీసుకెళ్లాలి

Apr 13 2025 2:07 AM | Updated on Apr 13 2025 2:07 AM

ఆశయాలు ప్రతి పల్లెకు తీసుకెళ్లాలి

ఆశయాలు ప్రతి పల్లెకు తీసుకెళ్లాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీన వాడ వాడలా డా.బీఆర్‌. అంబేడ్కర్‌ జయంతిని పండుగలా జరుపుకోవాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ సంఘం తరపున డాక్టర్‌. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు 100 మందిని సత్కరించనున్నట్లు చెప్పారు. అంబేడ్కర్‌ ఆశయాలను ప్రతి పల్లెకు తీసుకెళ్లి అక్షరాభ్యాసాన్ని పెంచేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుల్మని, జిల్లా అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement