పిడుగుపడి పాడి ఆవు మృతి
గుడిపాల: మండలంలోని చిత్తపార గ్రామానికి చెందిన పాడిరైతు చంద్ర పోషిస్తున్న పాడి ఆవు గురువారం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. చంద్ర పొలాల వద్ద ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈయన వ్యవసాయంతోపాటు ఐదు పాడి ఆవులు కూడా పోషిస్తున్నాడు. రాత్రి పిడుగులు పడడంతో చింతచెట్టు కింద కట్టి ఉంచిన పాడి ఆవు మృతి చెందింది. ప్రభుత్వం తనని ఆదుకోవాలని బాధితుడు కోరారు.
సారా స్థావరాలపై దాడి
● ఇద్దరి అరెస్టు
విజయపురం : మండలంలోని కేవీపురం దళితవాడలో గురువారం నగరి ఎకై ్సజ్ శాఖ సీఐ శ్రీనివాసరెడ్డి, తన సిబ్బందితో సారా స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, టాటా ఎస్ మినీవ్యాన్, 10 లీటర్ల సారా, 500 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం గ్రామాల్లో సారా నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సారా తయారీ చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 14405, లేదా 9440902549 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. ఆయన వెంట ఎస్‌ఐ రాకేష్ , సిబ్బంది ఉన్నారు.
పిడుగుపడి పాడి ఆవు మృతి


