చిత్తూరు అర్బన్ : జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న 10 మంది పోలీసులకు ఈ ఏడాది ఉగాది సేవా పతకాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు సీసీఎస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మునిరత్నంకు ఉత్తమ సేవా పతకం, ఆర్ముడ్ రిజర్వు విభాగం డీఎస్పీ మహబూబ్ బాష, స్పెషల్ బ్రాంచ్ సీఐ మనోహర్, ఏఎస్‌ఐ జి.దేవరాజులునాయుడు (డీసీసీ–చిత్తూరు), హెడ్ కానిస్టేబుళ్లు నీమతుల్ల (డీసీఆర్‌బీ–చిత్తూరు), బాలాజీ (గుడుపల్లె), వెంకటేశ్వర్లు (డీసీఆర్‌బీ–చిత్తూరు), ఎం.సురేష్‌కుమార్ (ఏఆర్–చిత్తూరు)తో పాటు కానిస్టేబుళ్లు పి.హరిబాబు (పంజాణి), ఎల్.మణిగండన్ (ట్రాఫిక్–చిత్తూరు)కు సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.
పోలీసులకు సేవా పతకాలు
పోలీసులకు సేవా పతకాలు