● వేలంలో ఇరువర్గాల మధ్య పోటాపోటీ ● రూ.9.15 లక్షలకు దక్కించుకున్న నేత
శ్రీరంగరాజపురం(కార్వేటినగరం) : కూటమి నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పోలీసులను రంగంలోకి దించినా మరోమారు కొత్తపల్లి మిట్ట సంత మార్కెట్‌ను వైఎస్సార్‌సీపీ పట్టు నిలుపుకుంది. ఎప్పుడూ లేని విధంగా నగరి డీఎస్పీ, కార్వేటినగరం సీఐ, మరో ఇద్దరు ఎస్‌ఐలు, 20 మంది పోలీస్ సిబ్బంది, మరో ప్రత్యేక దళాలు 20 మంది నడుమ నిర్వహించిన సంత వేలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టు నిలుపుకుని మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే వారపు సంతకు గురువారం పంచాయతీ అధికారులు వేలం పాట ప్రకటించారు. ఇరువ్గాల మధ్య పోటా పోటీగా కొనసాగిన వేలం పాటలో ఎట్టకేలకు వైఎస్సార్‌సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి రూ.9.15 లక్షలతో దక్కించుకున్నారు. ఎన్నడూ లేని విధంగా వేలం పాటకు పోలీసు బలగాలు మోహరించడంపై గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.