తవణంపల్లె: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ పి.వి.సుధాకర్ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని పట్నం బైపాస్ రోడ్డులో తమ సిబ్బందితో కలసి వాహనాలను తనిఖీ చేస్తుండగా మండలంలోని నలిశెట్టిపల్లెకు చెందిన ఎం.రామయ్య మోటారు సైకిల్‌పై ఏపీకి చెందిన 58 మద్యంబాటిళ్లను తరలిస్తుండగా పట్టుబడినట్లు వివరించారు. వాహనాన్ని, 58 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉండగా అనుమతి లేకుండా అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.