
సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్‌కే రోజా
నగరి: తిరుత్తణి సుబ్రమణ్యస్వామిని పంగుణి కృత్తికను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయానికి విచ్చేసిన వారు ఆలయ ప్రదక్షిణ చేసి సుబ్రమణ్యస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనల్లో పాల్గొని దర్శించుకున్నారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించుకున్నారు. తమది తండ్రీ, కూతుళ్ల బంధమని, తమ మధ్య ఆప్యాయతానురాగాలు ఎప్పటికీ తరగవన్నారు. ఆయన మిథునన్నపై ఎంత ఆప్యాయతను చూపుతారో తన పట్ల కూడా అంతే ఆప్యాయతను చూపుతారని మంత్రి ఆర్కేరోజా ఈ సందర్భంగా తెలిపారు. ఆయన ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.