వచ్చేస్తున్నాయి.. జెప్టో కేఫ్‌ సర్వీసులు | Zepto To Expand Cafe Service Across India | Sakshi
Sakshi News home page

వచ్చేస్తున్నాయి.. జెప్టో కేఫ్‌ సర్వీసులు

Nov 20 2024 12:42 PM | Updated on Nov 20 2024 2:50 PM

Zepto To Expand Cafe Service Across India

న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కేఫ్‌ సేవలను విస్తరిస్తున్నట్టు క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ జెప్టో తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్లలో 120కిపైగా కేఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్టు వివరించింది. త్వరలో హైదరాబాద్, చెన్నై, పుణే నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్టు వెల్లడించింది.

అధిక నాణ్యత గల ఆహార తయారీ ప్రక్రియతో 10 నిమిషాల డెలివరీని సాధ్యం చేశామని, అందుకే బలమైన కస్టమర్‌ స్పందనను చూస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రూయింగ్‌ నైపుణ్యాలను ఉపయోగించే కాఫీ మెషీన్‌లతో సహా కేఫ్‌ల కోసం అత్యాధునిక పరికరాలను నిశితంగా పరిశోధించి, తమ బృందం సేకరించిందని వివరించింది.

ఇదీ చదవండి: జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్‌ పాఠాలు

చాయ్, కాఫీ, అల్పాహారం, పేస్ట్రీస్, స్నాక్స్‌ వంటి 148 రకాల ఉత్పత్తులను 10 నిముషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని తెలిపింది. కొత్త నగరాలకు విస్తరించడం, ప్రతి నెలా 100కుపైగా కొత్త కేఫ్‌లను ప్రారంభిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,000 కోట్ల యాన్యువల్‌ రన్‌ రేట్‌ సాధిస్తామని జెప్టో సీఈవో ఆదిత్‌ పలీచా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement