నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో

Young boy buy expensive Mercedes Benz car video viral  - Sakshi

ఆధునిక కాలంలో ప్రజల జీవన శైలి, వారి జీవన విధానం మారిపోయాయి. చాలా మంది విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో యువత మరింత వేగంగా ఉన్నారు. ఇటీవల ఒక యువకుడు ఏకంగా రూ. 1 కోటి కంటే ఎక్కువకా ఖరీదైన కారుని కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో కనీసం 18 సంవత్సరాలు కూడా నిండని ఒక బాలుడు జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసాడు. ఇందులో కేవలం ఆ యువకుడు తన బాడీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు. ఇందులో అతని కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఈ కారుని అతడే కొన్నాడా? లేక వారి తల్లిదండ్రులెవరైనా గిఫ్ట్‌గా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు హైదరాబాద్‌లోని కంపెనీ అధీకృత డీలర్ అవుట్‌లెట్ నుంచి బ్లాక్ కలర్ Mercedes-Benz GLS 400 డెలివరీ చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లైసెన్స్ కూడా పొందలేని వయసులో కారు కొనటం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?)

ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 400డి విషయానికి వస్తే దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0-లీటర్ ఇన్‌లైన్-సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 326 bhp పవర్, 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది, కావున అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top