జనవరిలో రానున్న మీ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్  

Xiaomi Mi 11 Series Coming With Snapdragon 875 SoC - Sakshi

షియోమీ తన మీ 10 సిరీస్ తర్వాత రాబోయే సిరీస్ ను త్వరలో తీసుకొస్తున్నట్లు చాలాకాలంగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మీ 11 సిరీస్ తో రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ అవుతాయని సమాచారం. తాజా నివేదికల ప్రకారం, షియోమీ 2021 జనవరిలో మీ 11 మరియు మీ 11 ప్రోలను తీసుకురావాలని యోచిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ రాబోయే ఫోన్లలో మీ 11, మీ 11 ప్రో ఫోన్లు ఒకటని తెలుస్తుంది.(చదవండి: నోకియా లవర్స్ కి గుడ్ న్యూస్)

షియోమీ మీ 10 ప్రో అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న మీ 11 ప్రో మొబైల్  WQHD + ప్యానెల్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు డిస్ప్లేతో రాబోతుందని సమాచారం. స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ తో రాబోయే మొట్టమొదటి చైనీస్ ఫోన్‌గా ఇది గుర్తింపు పొందింది. స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ కంటే ఇది 20 శాతం ఎక్కువ పవర్ ఎఫిసియెంట్, 10 శాతం ఎక్కువ శక్తివంతమైనది. కొన్ని నివేదికల ప్రకారం, కొత్త స్నాప్‌డ్రాగన్ క్వాల్‌కామ్ చిప్‌సెట్ ఆపిల్ యొక్క A14 బయోనిక్ చిప్‌సెట్ కంటే వేగంగా పనిచేస్తుందని సమాచారం. ఇందులో ఉండే ప్రధాన కెమెరా 108-మెగాపిక్సెల్ నుండి 192-మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. ఇతర లెన్స్‌లలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ అప్‌గ్రేడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు ఉండనున్నాయి. దీని గురుంచి షియోమీ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ మీ 11 సిరీస్ వచ్చే ఏడాది జనవరి నాటికి కంపెనీ చైనాలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట దీని చైనా మార్కెట్ లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. షియోమీ మీ 11 సిరీస్ ను యుఎస్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 30 సిరీస్‌ను జనవరిలో లాంచ్ చేయడానికి ముందే తీసుకురావాలని చూస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top