Xiaomi: వచ్చేసింది..! ఇండియన్‌ ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌..! కొనుగోలుపై భారీ తగ్గింపు..!

Xiaomi 11i HyperCharge 5G With 120W Charging Launched in India - Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ భారత్‌లో ఫాస్టెస్ట్‌ హైపర్‌ ఛార్జింగ్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో షావోమీ 11ఐ హైపర్‌ ఛార్జ్‌, షావోమీ 11ఐ  స్మార్ట్‌ఫోన్లను గురువారం రోజున ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్‌ఐనా రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌గా Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. Xiaomi 11i 5జీ స్మార్ట్‌ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రానుంది. 


 

15 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జింగ్‌..!
Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ  కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ అవుతోందని కంపెనీ వెల్లడించింది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్, 6GB RAM + 128GB, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మరో స్మార్ట్‌ఫోన్‌ Xiaomi 11i 5జీ కూడా  6GB RAM + 128GB, 8GB RAM + 128GB వేరియంట్లలో రానుంది.   కామో గ్రీన్, స్టెల్త్ బ్లాక్ కలర్స్‌ వేరియంట్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

ధర ఎంతంటే..!
చైనా మార్కెట్‌లో Redmi 11 ప్రో + స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో రీబ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌గా రానుంది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ 6GB RAM + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 26,999కాగా, 8GB RAM + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,999 గా ఉంది. ఇక 67W సపోర్ట్‌ Xiaomi 11i 5జీ స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 26, 999గా, 6GB RAM + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24, 999 గా ఉంది. కాగా న్యూ ఇయర్‌ ఆఫర్‌ కింద ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు, రూ. 2, 500 క్యాష్‌ బ్యాక్‌ను షావోమీ అందిస్తోంది.  ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ జనవరి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్స్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.  

Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5జీ ఫీచర్స్‌

  • 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే విత్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌
  • 8GB ర్యామ్‌+ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 
  • ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC
  • 108-ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 
  • 16-ఎంపీ సెల్ఫీ కెమెరా
  • డ్యూయల్ జేబీఎల్‌-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్‌, 
  • 4,500mAh బ్యాటరీ
  • 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 5G కనెక్టివిటీ
  • యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌

చదవండి: ఇండియన్‌ ఫస్ట్‌ ఆటోఫోకస్డ్‌ ఫ్రంట్‌ కెమెరా..ఏరోస్పేస్‌ గ్రేడ్‌తో స్మార్ట్‌ఫోన్‌...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top