2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా? | World Cup 2023 Ads Revenue Expected To Surpass Rs 2000 Crore Amid Festive Season, Here's All You Need To Know - Sakshi
Sakshi News home page

World Cup 2023 Ad Revenue: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?

Oct 3 2023 5:38 PM | Updated on Oct 5 2023 5:58 PM

World Cup 2023 Ad revenue to surpass Rs 2000 crore amid festive cheer - Sakshi

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి  ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి వుంది.  ఒక పక్క మెగా టోర్నమెంట్  మరోపక్క దసరా-దీపావళి  పండుగలు.  దీంతో  అటు ఫ్యాన్స్‌, ఇటు వ్యాపారవేత్తల్లో భారీ  ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది ODI (వన్ డే ఇంటర్నేషనల్) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ప్రకటనల ద్వారా భారీ ఆదాయం సమకూరనుందని  పరిశ్ర వర్గాల అంచనా.

ప్రపంచ కప్ 2023  డిజిటల్ ఆదాయాలు ఈ సంవత్సరం గణనీయంగా  పెరుగుతాయని, మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే  70 శాతం ఎక్కువ పెరగవచ్చట. దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని అంచనా. 2019 ప్రపంచ కప్‌లో ఖర్చు చేసిన దాని కంటే రెట్టింపు  ఖర్చుపెట్టనున్నారనే  అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  ముఖ్యంగా పండుగ కాలంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగు తాయని విక్రయదారులు భావిస్తున్నారు.  

అటు ఫ్యాన్స్‌కు ,ఇటు  ప్రకటనదారులకు పండగే
2022తో పోల్చితే 2023లో పండుగ కాలంలో ప్రకటన ఖర్చు కనీసం 10-15 శాతం పెరుగుతుందని యాడ్ ఏజెన్సీ పల్ప్ స్ట్రాటజీ వ్యవస్థాపకుడు , ఎండీ అంబికా శర్మ తెలిపారు. రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ చాలా మంది వీక్షకులకు, ప్రకటనదారులకు  ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఏడాదికి మొత్తం యాడ్ ఖర్చులో 40-45 శాతం పండుగ కాలంలోనే జరుగుతుంది. క్రికెట్‌కు రోజుకు రోజుకు పెరుగుతున్న ఆదరణ, అందులోనూ ఈ ఏడాది ఫెస్టివ్‌ సీజన్‌లో వస్తున్న ప్రపంచ కప్ ద్వారా టీవీ ,డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి రూ. 2,000-2,200 కోట్ల ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. .2019 క్రికెట్ వరల్డ్ కప్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆధారిత ఆదాయం రూ. 400-రూ. 500 కోట్ల లోపే. 

డిజిటల్‌ ప్లాట్‌ఫారంల ద్వారా  క్రికెట్‌కు భారీ క్రేజ్‌

క్రికెట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో క్రికెట్‌కు  భారీ  క్రేజ్‌ ఏర్పడింది. డిజిటల్ ఛానెల్‌లలో తక్కువ  ధరలు అనేక బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈనేపథ్యంలోనే క్రికెట్ వరల్డ్ కప్ 2023 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)   వచ్చిన డిజిటల్‌ యాడ్స్‌ రెవెన్యూ దీనికి ఉదాహరణ. 2023 క్రికెట్ వరల్డ్ కోసం డిజిటల్‌పై యాడ్ రేట్ వెయ్యి ఇంప్రెషన్‌లకు రూ. 230-250 పరిధిలో ఉంది. 2019 ఎడిషన్‌లో ప్రతి వెయ్యి ఇంప్రెషన్‌లకు రూ. 140-150తో పోలిస్తే 60 శాతం ఎక్కువ (CPM). ప్రపంచ కప్ కోసం ఈ ఏడాది టీవీలో ప్రకటనల ఖర్చు 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. అందులోనూ భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్‌అంటే ఆ క్రేజే వేరు. ఇలాంటి  ప్రీమియం మ్యాచ్‌ల కోసం 10 సెకనుల రేట్లు దాదాపు రూ. 30 లక్షలు.

ప్రపంచ కప్ సానుకూల ప్రభావంతో సహా 2023లో ప్రకటనల పరిశ్రమ మొత్తం వృద్ధి రేటు 8-9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎలారా  క్యాపిటల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తౌరానీ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్కువ శాతం వృద్ధి వస్తుందని అంచనా. 

క్యూ కట్టిన దిగ్గజ స్సాన్సర్లు
అక్టోబరు 5 నుండి షురూ కానున్న ఐసీసీ పురుషుల  ప్రపంచ కప్ 2023  అధికారిక ప్రసార భాగస్వామి, స్ట్రీమింగ్ భాగస్వామి అయిన డిస్నీ స్టార్ ఇప్పటివరకు టోర్నమెంట్ కోసం 21 మంది స్పాన్సర్‌లు , 500 కంటే ఎక్కువ మంది ప్రకటనదారులు సైన్ అప్ చేసారు. మహీంద్రా & మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, MRF టైర్స్, Dream11, Booking.com, వంటి కొన్ని టోర్నమెంట్ స్పాన్సర్‌లుగా  ఉన్న సంగతి తెలిసిందే.

నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంటు-2023 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజా 13వ ఎడిషన్‌ను  భారతదేశం  హోస్ట్‌ చేస్తోంది.  ఈ మెగా  టోర్నమెంట్‌ అక్టోబర్ 5న  ప్రారంభమై వచ్చే నెల(నవంబర్) 19న  ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement