వర్క్‌ ఫ్రం హోమ్‌ ఎప్పటికీ కొనసాగుతుంది

Work from home culture to continue even after pandemic ends - Sakshi

ఈ విధానానికే కంపెనీల మొగ్గు

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌

ముంబై: ఇంటి నుంచి విధులు నిర్వర్తించే (వర్క్‌ ఫ్రం హోమ్‌) సంస్కృతి బాగా పని చేసిందని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ అన్నారు. కరోనా మహమ్మారి తొలగిపోయినా చాలా కంపెనీలు ఈ విధానాన్ని కొనసాగిస్తాయని తెలిపారు. ‘కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. దీంతో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోమ్‌కు మార్చివేశాయి. మహమ్మారి ముగిసిన తర్వాత కార్యాలయాల్లో ఉద్యోగులు ఎంత సమయం వెచ్చించాలో కంపెనీలు పునరాలోచించుకోవాలి. (ఇంటి నుంచే పని చేస్తాం: ఐటీ ఉద్యోగులు)

చాలా కంపెనీలు తమ ఉద్యోగులు ఎక్కువ సమయం కార్యాలయంలో పని చేయాలని భావిస్తాయి. వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం ఆకర్షణీయంగా లేదు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ మరింత మెరుగవ్వాలి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ ఆశ్చర్యకరంగా బాగా పని చేసింది. అయితే చిన్న పిల్లలు ఉన్నా, ఇల్లు చిన్నదైనా, పనులున్నా విధులకు కష్టం. మహిళలు అయితే వారు నిర్వహించడానికి చాలా విషయాలున్నాయి. కాబట్టి వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంలో కొన్ని లోపాలూ ఉన్నాయి’ అని అన్నారు. పనికోసం ఈ ఏడాది తాను ఎక్కడికీ ప్రయాణించలేదని చెప్పారు. ‘చాలా ఎక్కువ చేయడానికి సమయం లభించింది. ఇది నాకు కనువిప్పు’ అని వ్యాఖ్యానించారు. (వర్క్‌ ఫ్రం హోమ్‌.. రియాలిటీ ఇదే)

జనాభాయే భారత్‌కు సవాల్‌..
భారత్‌ విషయానికి వస్తే లాక్‌డౌన్‌ సమయంలో లబ్దిదారులకు నగదు బదిలీకి డిజిటల్‌ మౌలిక వసతులను వినియోగించడం వంటి అద్భుతమైన పనులు చేశారు. కానీ జనాభాయే భారత్‌కు సవాలు’ అని బిల్‌గేట్స్‌ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top