వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ | WhatsApp Update Adds Custom Wallpaper For Each Chat | Sakshi
Sakshi News home page

ఛాట్ ఛాట్‌కి కొత్త వాల్‌పేపర్‌

Dec 2 2020 11:56 AM | Updated on Dec 2 2020 2:58 PM

WhatsApp Update Adds Custom Wallpaper For Each Chat - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 2బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే వాట్సప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఇతరులతో చాట్ చేసేటప్పుడు ప్రతి ఛాట్‌ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. దీనికోసం కొత్తగా వాల్‌పేపర్‌ గ్యాలరీ అప్‌డేట్ చేశారు. అలాగే వినియోగదారులు స్టిక్కర్లను టెక్స్ట్ లేదా ఎమోజీలతో సహాయంతో శోధించడానికి ఒక ఫీచర్ ని కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క “టుగెదర్ ఎట్ హోమ్” స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు యానిమేటెడ్ స్టిక్కర్లుగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.(చదవండి: ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే)

కస్టమ్‌ వాల్‌పేపర్ ఫీచర్‌లో భాగంగా కొత్తగా 32 బ్రైట్ వాల్‌పేపర్స్‌, 30 డార్క్‌ వాల్‌పేపర్స్‌ ఇస్తున్నట్లు వాట్సాప్ తన బ్లాగ్ లో తెలిపింది. మీ ఫోన్ లో లైట్ మరియు డార్క్ మోడ్ సెట్టింగుల కోసం ప్రత్యేక వాల్‌పేపర్‌లను కూడా ఎంచుకోవచ్చు. మీ ఫోన్ లో డార్క్ మోడ్ మారినప్పుడు మీ చాట్ యొక్క వాల్‌పేపర్ దానంతట అదే మారనుంది అని పేర్కొంది. వాట్సాప్ డిఫాల్ట్ డూడుల్ వాల్‌పేపర్‌ను మరిన్ని రంగుల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. మీకు నచ్చిన వాల్‌పేపర్‌ ఎంచుకొని దానికి తగినట్లుగా బ్రైట్ నెస్, ఓపెసిటీలో మార్పులు చేసుకోవచ్చు. ఒక వేళ మీకు ఇది నచ్చకపొతే పాత వాల్‌పేపర్ ఎంచుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది అని ఫేసుబుక్ తెలిపింది. త్వరలో దీనిని అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement