ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే

Google Announces Best Android Apps and Games of 2020 - Sakshi

2020 ఏడాది ముగుస్తున్న సందర్బంగా ప్లే స్టోర్ బెస్ట్ యాప్స్ ప్రకటించింది గూగుల్. బెస్ట్ యాప్స్ మాత్రమే విడుదల చేయకుండా.. కేటగిరీలుగా విభజించి ప్లే స్టోర్ లో ఉన్న బెస్ట్ గేమ్స్, మూవీస్, బుక్స్ జాబితాను విడుదల చేసింది. ప్రతి రోజు కొత్త కొత్త యాప్స్ ప్లే స్టోర్ లో వస్తుంటాయి. ఆలా వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే పాపులర్ అవుతాయి. బాగా పాపులర్ వాటిని యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటారు. కొత్తగా వచ్చినవి పాపులర్ అయ్యే అవకాశం ఎక్కువ. అందుకే ప్రతి ఏడాది చివర్లో వినియోగదారుల అభిప్రాయాలను తీసుకోని అందులో బెస్ట్ యాప్స్ ఏవో ప్రకటిస్తుంది. అలాగే కేటగిరీల వారీగా ఉత్తమమైన వాటి జాబితాను ఏడాది చివర్లో విడుదల చేస్తూ ఉంటుంది గూగుల్. ఈసారి కూడా అనేక యాప్స్‌ని ప్రకటించింది. పర్సనల్ గ్రోత్, ఎవ్రీడే ఎస్సెన్షియల్ లాంటి కేటగిరీస్‌లో యాప్స్ లిస్ట్ ప్రకటించింది గూగుల్. (చదవండి: పబ్‌జీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్)

2020 ఏడాదిలో వచ్చిన యాప్స్ లలో బెస్ట్ ఆఫ్ 2020 అవార్డును 'స్లీప్ బై వైసా' యాప్ దక్కించుకుంది. అలాగే గేమ్ పరంగా చుస్తే  2020 బెస్ట్ గేమ్ యాప్ అవార్డును 'లెజెండ్స్ ఆఫ్ రన్‌టెరా' కు ఇచ్చారు. యాప్స్ లలో 2020 యూజర్స్ ఛాయిస్ యాప్ అవార్డును మైక్రోసాఫ్ట్ ఆఫీస్: వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కు ఇచ్చారు. అలాగే 2020 యూజర్స్ ఛాయిస్ గేమ్ యాప్ అవార్డును క్రికెట్ ఛాంపియన్‌షిప్ 3 - డబ్ల్యుసిసి3కు ఇచ్చారు. ప్రశాంతమైన నిద్ర కోసం నిద్ర కథలు వినిపించడంతో పాటు ఆలోచనాత్మకంగా రూపొందించిన యాప్ ఈ 'స్లీప్ బై వైసా' యాప్ అని గూగుల్ పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా చాల మంది నిద్రలేమితో భయపడే వారికీ ఇది చాలా ఉపయోగపడింది అని గూగుల్ పేర్కొంది. ఎపిక్ గేమ్స్ వారు అభివృద్ధి చేసిన లెజెండ్స్ ఆఫ్ రన్‌టెరా అనే యాప్ క్రీడా అభిమానులకు ఆసక్తికరమైన డిజైన్ మరియు ప్రత్యర్థుల మధ్య నిజమైన యుద్ధ అనుభూతిని కలిగించడం ద్వారా బెస్ట్ యాప్ గా నిలిచింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top