పబ్‌జీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ 

PUBG Mobile India Will Take Some More Time to India - Sakshi

న్యూఢిల్లీ: పబ్‌జీ అభిమానులకు చేదువార్త. పబ్‌జీ తిరిగి సేవలను భారత్ లో తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టేలాగా ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్‌జీ కార్పొరేషన్ కి ఇంకా పూర్తీ స్థాయి అనుమతులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుతం నిషేధం విధించిన తర్వాత తిరిగి భారత్ లోకి "పబ్‌జీ మొబైల్ ఇండియా" పేరుతో గ్లోబల్ వెర్షన్ కి భిన్నంగా రావాలని ప్రయత్నిస్తుంది. దీంతో పబ్‌జీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. భారత్ దేశంలో పబ్‌జీ గేమ్ ని పూర్తీ స్థాయిలో తీసుకొచ్చేందుకు, అన్ని విధానాలను పూర్తీ చేసి ఈ నెల మొదటి వారంలో తీసుకురావాలని భావించింది. కానీ, దీనికి కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) నుంచి పూర్తీ స్థాయి అనుమతులు మాత్రం రాలేదు. గతంలో నిషేధింపబడ్డ సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మన దేశంలో ఒక కొత్త సంస్థను ఫ్లోట్ చేసి తీసుకురావడం సరైన విధానం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఒక వేళా తిరిగి రావడం అంత సులభం అయితే ఇదే భాటలో టిక్ టాక్ కూడా తిరిగి వచ్చేదని, ఇది దేశ భద్రతకు సంబందించిన విషయం అని తెలిపింది. దీంతో పబ్‌జీ గేమ్ కి భారత్ లోకి ప్రవేశించేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top