వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. దాని వల్ల ఉపయోగం ఏంటంటే?

Whatsapp Reportedly Working On New Interface For Android - Sakshi

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం మరో అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. ఇప్పటికే చాట్‌ లాక్‌, స్క్రీన్‌ షేరింగ్‌ వంటి ఫీచర్లను అందించిన వాట్సాప్‌ తాజాగా చాట్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది.

వీబీటా ఇన్ఫో ప్రకారం.. వాట్సాప్‌ యూజర్లు చాట్‌చేసే సమయంలో గతంలో చేసిన చాట్‌లను వెతికేందుకు, చదవని మెసేజ్‌లను చదివేందుకు కాంటాక్ట్స్‌, బిజినెస్‌ కాంటాక్ట్స్‌ను సులభంగా గుర్తించ వచ్చు. ఇందుకోసం చాట్‌పేజ్‌పై భాగంలో సెర్చ్‌ బార్‌ను తీసుకొని రానుంది. 

కొత్త ఫీచర్‌ ఎలా ఉంటుందంటే
నివేదిక ప్రకారం.. కొత్త డిజైన్ స్క్రీన్‌షాట్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. స్క్రీన్‌షాట్‌లో యాప్‌ పై భాగంలో బార్‌ తెలుపు రంగులో కనిపిస్తుంది. అయితే యాప్ పేరుతో సహా ఇతర ఆప్షన్‌లు గ్రీన్‌ కలర్‌లో ఉంటాయి. నావిగేషన్ బార్ సైతం దిగువ భాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా, వాట్సాప్‌ ఈ కొత్త డిజైన్‌.. గూగుల్‌ డిజైన్‌3 మార్గదర్శకాలకు అనుగుణంగా డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top