వాట్సాప్‌.. మరిన్ని కొత్త ఫీచర్స్‌! | Whatsapp to introduce 12 new features soon | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌.. మరిన్ని కొత్త ఫీచర్స్‌!

Nov 28 2020 2:40 PM | Updated on Nov 28 2020 3:58 PM

Whatsapp to introduce 12 new features soon  - Sakshi

ముంబై, సాక్షి: ఇటీవల డిజెప్పీరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ను ప్రారంభించిన వాట్సాప్‌ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్స్‌ను అందించనున్నట్లు వేబ్‌టెయిన్‌ఇన్ఫో పేర్కొంది. వీటిలో రీడ్‌ లేటర్‌, వీడియోలను పంపే ముందు మ్యూట్‌ చేయడం, రిపోర్ట్‌ టు వాట్సాప్‌ తదితర ఫీచర్లను ప్రస్తావించింది. కొద్ది రోజులక్రితం వాట్పాస్‌ పేమెంట్స్‌, బల్క్‌ డీలిట్‌, షాపింగ్‌ బటన్‌ తదితరాలను వాట్సాప్‌ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 12 కొత్త ఫీచర్లు అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం..

రీడ్‌ లేటర్‌
మెసేజీలను తదుపరి కాలంలో చదివేందుకు వీలుగా రీడ్‌ లేటర్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ రూపొందిస్తోంది. ఇది ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆర్కీవ్‌డ్‌ చాట్స్ ఫీచర్‌ పరిధిలోనికి వస్తుంది. ఈ ఫీచర్‌ను మరింత ఆధునీకరిస్తోంది. ఈ ఫీచర్‌ను ఆన్‌ చేస్తే ఆర్కీవ్‌ చేసిన చాట్‌ నుంచి కాల్స్‌ లేదా మెసేజీలను అందుకునే వీలుండదు. అయితే వెకేషన్‌ మోడ్‌తో సహా ఆధునీకరించిన ఈ ఫీచర్‌ ద్వారా ఆర్కీవ్‌ చేసిన అన్ని మెసేజీలతోపాటు.. కొత్తగా వచ్చిన మెసేజీలను స్టోర్‌ చేసుకోవచ్చు. కాగా.. రీడ్‌లేటర్‌ను ఆన్‌ చేస్తే ఈ చాట్‌కు సంబంధించి నోటిఫికేషన్స్‌ వెలువడవు. తద్వారా మధ్యలో అంతరాయాలకు తెరదించవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. వెకేషన్‌ మోడ్‌పైనా ప్రస్తుతం వాట్సాప్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని సందర్భాలలో కాంటాక్టులను బ్లాక్‌ చేయడంతో సమస్యలకు చెక్‌ పెట్టలేము. ఇందుకుగాను రిపోర్ట్‌ టు వాట్సాప్‌ ఫీచర్‌ను రూపొందిస్తోంది. తద్వారా ఈ కాంటాక్టు నుంచి తదుపరి మెసేజీలకు బ్రేక్‌ పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

4 డివైస్‌లు
ప్రస్తుతం వాట్సాప్‌ను మొబైల్‌లో వాట్సాప్‌తోపాటు.. వెబ్‌ యాప్‌ ద్వారా రెండు డివైస్‌లలో ఓకేసారి వినియోగించేందుకు వీలున్న విషయం విదితమే. అయితే వినియోగదారుడు ఒకే అకౌంట్‌ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్‌లలో వాట్సాప్‌ను వినియోగించేందుకు వీలు కల్పించే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధివర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్‌ వాల్‌పేపర్‌ ఫీచర్‌ పేరుతో యూజర్లు ఒక్కో కాంటాక్టుకు ఒక్కోరకమైన వాల్‌పేపర్‌ను సెట్‌ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement