Whatsapp Beta for Android Crashing for Some Users Bug Fixed Says Report - Sakshi
Sakshi News home page

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు కొత్త తలనొప్పి..! యాప్‌లో సమస్య..వెంటనే ఇలా చేయండి..!

Jan 30 2022 12:24 PM | Updated on Jan 30 2022 1:38 PM

Whatsapp Beta For Android Crashing For Some Users Bug Fixed Report - Sakshi

మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టెంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో కొత్త సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యతో తరుచూ వాట్సాప్‌ యాప్‌ క్రాష్‌ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమస్య కేవలం వాట్సాప్‌ బీటా వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. 

ఒపెన్‌ చేస్తే ఎర్రర్‌..!
వాట్సాప్‌ బీటా యూజర్లు యాప్‌ను ఓపెన్‌ చేసినప్పుడు లేదా మీడియాను షేర్‌ చేసినప్పుడు ఎర్రర్‌ వచ్చినట్లు పలువురు యూజర్లు నివేదించారు. ఈ సమస్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే వాట్సాప్‌ బీటా ఫర్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌ క్రాష్‌ అవుతున్నట్లు మెటా కూడా నిర్థారించింది. యాప్‌ క్రాష్‌కు కారణమైన బగ్‌కు మెటా పరిష్కారాన్ని కూడా చూపింది. 


 

ఇలా చేస్తే సెట్‌..!
వాట్సాప్‌ ట్రాకర్‌ WABetaInfo ప్రకారం..కొత్త మంది బీటా యూజర్లకు యాప్‌ క్రాష్‌ సమస్య వస్తోన్నట్లు నివేదించింది. వాట్సాప్‌ బీటా ఫర్‌ ఆండ్రాయిడ్‌  2.22.4.6, 2.22.4.7 వెర్షన్ల యూజర్లు మీడియాను ఇతర యూజర్లతో షేర్‌ చేస్తున్నప్పుడు క్రాష్‌ అవుతున్నట్లు సమాచారం. ఈ సమస్యకు మెటా పరిష్కారాన్ని చూపింది. వాట్సాప్‌ బీటా  2.22.4.6, 2.22.4.7 వెర్షన్లను వాడే యూజర్లను వెంటనే 2.22.4.8 వెర్షన్‌కు అప్‌డేట్‌ చేయాలని మెటా సూచించింది. వాట్సాప్‌ యూజర్ల డేటాను భద్రంగా ఉంచేందుకుగాను ఆయా యూజర్లు తమ గూగుల్‌ డ్రైవ్‌తో బ్యాకప్‌ చేసుకోవాలని వాట్సాప్‌ ట్రాకర్‌ WABetaInfo తెలిపింది. 

చదవండి: మీరు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మినా..! అయితే మీకో గుడ్‌న్యూస్‌..!

Advertisement
 
Advertisement
Advertisement