Whatsapp: వాట్సాప్‌లో రూపాయి సింబల్‌ ఫీచర్‌..ఎందుకంటే

whatsapp add one rupee symbol on chat composer - Sakshi

న్యూఢిల్లీ: చాట్‌ కంపోజర్‌కు రూపాయి గుర్తును జోడించినట్టు వాట్సాప్‌ ప్రకటించింది. చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వినియోగదార్లకు అందరికీ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ తోడవడానికి కొన్ని రోజులు పడుతుంది. 

అలాగే కంపోజర్‌లో ఉన్న కెమెరాతో 2 కోట్లకుపైగా స్టోర్లలో క్యూఆర్‌ కోడ్స్‌ను స్కాన్‌ చేయవచ్చు. 1.5 కోట్ల మంది చిన్న వర్తకులు వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ వాడుతున్నారు. వీరంతా వాట్సాప్‌ యూజర్ల నుంచి చెల్లింపులను స్వీకరించవచ్చు. పేమెంట్స్‌ సేవలను కంపెనీ భారత్‌లో గతేడాది నవంబర్‌లో ప్రారంభించింది.   

చదవండి: వాట్సాప్‌లో మనీ ట్రాన్స్‌ఫర్‌ ఇలా చేయండి..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top