పన్ను చెల్లింపు దారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్‌ 15 ఆఖరి తేదీ! | What Is Advance Tax? Advance Tax Payment Is Due On December 15, 2023 | Sakshi
Sakshi News home page

Advance Tax : పన్ను చెల్లింపు దారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్‌ 15 ఆఖరి తేదీ!

Dec 13 2023 4:37 PM | Updated on Dec 13 2023 5:29 PM

What Is Advance Tax? Advance Tax Payment Is Due On December 15, 2023 - Sakshi

ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. మరో రెండు రోజుల్లో అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పేమెంట్‌ చెల్లించాల్సిన గడువు ముగియనుంది. ట్యాక్స్‌ పేయర్స్‌ వెంటనే అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పేమెంట్‌ చేయాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. లేదంటే జరిమానా, అదనంగా వడ్డీ  ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 


అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పే అంటే ఏమిటి?  
రాబోయే ఆదాయాన్ని అంచ‌నా వేసి ముంద‌స్తుగా చెల్లించే పన్నునే అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. ఈ ముందస్తు ప‌న్నును ఒకే సారి సంవ‌త్సరం చివ‌ర‌ కాకుండా ద‌శ‌ల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పేని ఎవరు చెల్లించాలి? 
సెక్షన్‌ 208 ఇన్‌ కం ట్యాక్స్‌ యాక్ట్‌, 1961 ప్రకారం.. అంచ‌నా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయ‌ప‌న్ను రూ.10వేలు లేదా అంత కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ విభాగంలో వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఇలా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది. 

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పే ఎవరికి మినహాయింపు ఉంటుంది?
ఉద్యోగులకు చెల్లించే జీతంలో టీడీఎస్‌ కట్‌ అవుతుంది. అయితే, ఉద్యోగులు జీతం కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పొందుతుంటే అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపు అనేది తప్పని సరి.  60 సంవ‌త్సరాలు పైబ‌డి ఎలాంటి వ్యాపార‌, వృత్తిగ‌త ఆదాయం లేని సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు కూడా దీని నుంచి మినహాయింపు ఉంటుంది.

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను ఎలా లెక్కించాలి?
ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో (2022-2023) అందే అన్ని ర‌కాల ఆదాయాల‌ను అంచ‌నా వేయాలి. ఇలా అంచ‌నా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న ప‌న్ను మిన‌హాయింపుల‌ను తీసివేయాలి. ఆ త‌ర్వాత మిగిలిన ఆదాయంపై ప‌న్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం ప‌న్ను విలువ రూ.10 వేలు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే ముంద‌స్తు ప‌న్ను చెల్లించాలి. 

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించకపోతే కట్టాల్సిన జరిమానాలు
సెక్షన్‌ 234బీ,234 సీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ అడ్వాన్స్‌ ట్యాక్స​ పేమెంట్ చేసేందుకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సెక్షన్ల కింద నెలకు 1 శాతం లేదా దానిలో కొంత వడ్డీ పడుతుంది. 

అడ్వాన్స్‌ ట్యాక్స్‌​ చెల్లించాల్సిన తేదీలు 
జూన్‌ 15 కంటే ముందు : 15 శాతం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను తప్పని సరిగా చెల్లించాల్సి

సెప్టెంబర్‌ 15 కంటే ముందు : మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 45 శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తం చెల్లించాలి.  

డిసెంబ‌ర్ 15 కంటే ముందు - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 75శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే క‌ట్టిన ముంద‌స్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి.  

చివరిగా :: మరో రెండు రోజుల్లో అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పే తేదీ గడువు ముగియనుందని, చెల్లింపు దారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement