ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్‌ సర్కిల్‌ పెట్టుబడులు  | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్‌ సర్కిల్‌ పెట్టుబడులు 

Published Wed, Dec 14 2022 8:37 AM

We Founder Circle Invests10 startups in Telangana and Andhra Pradesh - Sakshi

న్యూఢిల్లీ: స్టార్టప్‌ కంపెనీ అయిన ‘వీ ఫౌండర్‌ సర్కిల్‌’ (డబ్ల్యూఎఫ్‌సీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో గణనీయమైన స్టార్టప్‌ పెట్టుబడుల ప్రణాళికలతో ఉన్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో 50కు పైగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. 2023లో కనీసం ఎనిమిది స్టార్టప్‌లకు నిధులు సమకూర్చనున్నట్టు పేర్కొంది. సగటున ఒక్కో పెట్టుబడి రూ.82 లక్షల నుంచి రూ1.23 కోట్ల మధ్య ఉంటుందని ‘టై గ్లోబల్‌ సదస్సు’లో భాగంగా డబ్ల్యూఎఫ్‌సీ ప్రకటించింది.

ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఐదు స్టార్టప్‌లలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టినట్టు పేర్కొంది. ద్వితీయ, తృతీయ తరగతి పట్టణాలకు చెందిన ఇన్వెస్టర్ల కోసం మంచి ప్రణాళికలతో ముందుకు వస్తామని సంస్థ సహ వ్యవస్థాపకుడు గౌవర్‌ వీకే సింఘ్వి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement