పబ్జి లవర్స్ జర జాగ్రత్త

Warning For PUBG Lovers, Beware Of Fake PUBG Mobile India APK Files - Sakshi

మీరు పబ్జి ప్రియులా..? మీరు త్వరలో రాబోయే పబ్జి కోసం వేచిచూస్తున్నారా? అయితే జర జాగ్రత్త. గతంలో పబ్జి కార్పొరేషన్ పబ్జి మొబైల్ ఇండియా పేరుతో యాప్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి పబ్జి మొబైల్ ఇండియా పేరుతో అనేక ఏపీకే లింకులు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. అయితే టెక్ నిపుణులు మాత్రం వీటి జోలికి వెళ్ళద్దు అని తెలుపుతున్నారు. ఈ ఏపీకే లింకుల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ సమాచారాన్ని హ్యాక్ చేసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. (చదవండి: 5వేలకే గెలాక్సీ ఎస్ 20 మొబైల్స్)

పబ్జి కార్పొరేషన్ మాత్రం అధికారికంగా ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. అధికారికంగా ఆట విడుదలయ్యే వరకు వేచి ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో మాత్రం కొన్ని నివేదికలు పబ్జి మొబైల్ ఇండియాను డిసెంబర్ 25న విడుదల చేయవచ్చని సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పబ్జి కార్పొరేషన్ ఇంకా దీనిని ధృవీకరించలేదు. పబ్జి లవర్స్ ని లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు నకిలీ ఏపీకే లింకులతో వల విసురుతున్నారు. ఒకవేల ఎవరైనా పొరపాటున ఈ లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే వారు మీ డివైస్ ని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఫేక్‌ ఫైల్స్ ద్వారా మీ డివైజ్‌లోకి మాల్‌వేర్‌ను పంపించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాద ముందని టెక్‌ నిపుణలు హెచ్చరిస్తున్నారు. అధికారికంగా విడుదల అయ్యే వరకు ఈ ఏపీకే లింకుల జోలికి మాత్రం వెళ్లకూడదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top