వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్

 Vodafone Idea 5g Now Live In Select Places In Delhi And Pune - Sakshi

దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో భారత మార్కెట్లో 5జీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.

వొడాఫోన్ ఐడియా 5జీ 
5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వొడాఫోన్ ఐడియా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. ఢిల్లీ, పూణేలోని నిర్దిష్ట ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే 'విఐ 5జీ రెడీ సిమ్' ఉపయోగించి కనెక్షన్ పొందవచ్చు అని పేర్కొంది. దేశంలో వొడాఫోన్‌ ఐడియా 5జీ సేవలకు ఊతం ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా ఆగస్టులో 26జీహెచ్‌,  3.3జీహెచ్‌జెడ్‌ బ్యాండ్‌లను ఉపయోగించి పూణేలో 5G సేవలను విజయవంతంగా పరీక్షించింది.

గత ఏడాది జులైలో స్పెక్ట్రమ్‌ వేలం
అయితే, గత ఏడాది జూలై నెలలో జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 17 టెలికం సర్కిళ్లను సొంతం చేసుకుంది. కానీ వాటిల్లో 15 సర్కిళ్లలో 5జీ నెట్‌వర్క్‌ని అందించలేమని ఆ సంస్థ సీఈవో అక్షయ్‌ మూంద్రా తెలిపారు.  

ఆసక్తికర పరిణామాలు
ఈ నేపథ్యంలో ఇండియా ముబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) ఈవెంట్లో వొడాఫోన్‌ ఐడియా నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ కుమార్‌ మంగళం బిర్లా మాట్లాడుతూ.. దేశంలో 5జీ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు దశల వారీగా 4జీ, 5జీ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ తరుణంలో వొడాఫోన్‌ 5జీ సేవలు రానున్నాయనే నివేదికలతో టెలికం రంగంలో ఆసక్తిర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top