ఏపీలో విష్ణు కెమికల్స్‌ పెట్టుబడులు | Vishnu Chemicals approves capex of up to Rs 1000 cr | Sakshi
Sakshi News home page

ఏపీలో విష్ణు కెమికల్స్‌ పెట్టుబడులు

Published Tue, Feb 28 2023 12:29 AM | Last Updated on Tue, Feb 28 2023 12:29 AM

Vishnu Chemicals approves capex of up to Rs 1000 cr - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ విష్ణు కెమికల్స్‌ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లో స్పెషాలిటీ కెమికల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

దీనికి సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు తెలిపింది. విష్ణు కెమికల్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా 57 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఆటోమొబైల్, ఫార్మా, ఉక్కు తదితర పరిశ్రమలకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement