మస్క్‌ చేతికి వొడాఫోన్‌ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ

Viral Posts On Starlink Buy The Vodafone IDEA Shares - Sakshi

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌‌‌‌‌ అప్పుల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా సంస్థలో వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, క్లిప్‌లు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా స్పందించింది. 

స్టార్‌లింగ్‌ తమ కంపెనీలో వాటా కొనుగోలు చేయడానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపడం లేదని  టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రకటించింది. వాటా కొనుగోలుకు అవకాశం  ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము  కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు  స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. సామాజికమధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మకూడదని చెప్పింది. ఏ సమాచారమైన అధికారిక వెబ్‌సైట్‌ల్లో సరిచేసుకోవాలని తెలిపింది.

ఇదీ చదవండి: కొత్త కార్ల పరుగు

దేశంలో తొలిసారి టెలికాం రంగంలో ప్రవేశించేందుకు స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ వోడాఫోన్ ఐడియాతో జతకట్టవచ్చనే ప్రచారం వల్ల వీఐ షేర్లు ఇటీవల భారీగా ర్యాలీ అయ్యాయి. స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ భారత మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రభుత్వం వీఐలో తన 33.1 శాతం వాటాను మస్క్‌‌‌‌‌‌‌‌కు విక్రయించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. మస్క్ వచ్చే వారం వైబ్రెంట్ గుజరాత్ బిజినెస్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యేందుకు భారత్‌ రానున్న నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధ్యాన్యం సంతరించుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top