Vijay Shekhar Sharma Bought Huge Shares Of Paytm - Sakshi
Sakshi News home page

1.72 లక్షల పేటీఎం షేర్లు కొన్న విజయ్‌ శేఖర్‌

Jun 20 2022 8:02 AM | Updated on Jun 20 2022 10:38 AM

Vijay Shekhar Sharma Bought Huge Shares Of Paytm - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్‌ కౌంటర్‌కు తాజాగా డిమాండ్‌ పుట్టింది. కంపెనీ ఎండీ విజయ్‌ శేఖర్‌ శర్మ గత నెలాఖరున మొత్తం 1.72 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లు వన్‌ 97 కమ్యూనికేషన్స్‌(మాతృ సంస్థ) కౌంటర్‌పై దృష్టిసారించారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో శుక్రవారం పేటీఎమ్‌ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 646 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 599 వద్ద కనిష్టాన్ని తాకిన షేరు రూ. 648 వద్ద గరిష్టానికీ చేరింది. 

మే 30న విజయ్‌ రూ. 6.3 కోట్లు వెచ్చించి 1,00,552 పేటీఎమ్‌ షేర్లు కొనుగోలు చేశారు. ఇక 31న సైతం రూ. 4.7 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 71,649 షేర్లు సొంతం చేసుకున్నారు. కంపెనీ ఐపీవో చేపట్టి ఆరు నెలలు దాటడంతో విజయ్‌ శేఖర్‌.. పేటీఎమ్‌ షేర్లను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో రూ. 2,150 ధరలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి షేరు ధర క్షీణిస్తూ వచ్చి మే 12న రూ. 510 వద్ద కొత్త కనిష్టానికి చేరింది. 

చదవండి: రాబడుల కోసం.. మీ రూట్‌ ఎటు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement