వాహనాల తుక్కు ‘సింగిల్ విండో’లోకి 11 రాష్ట్రాలు

న్యూఢిల్లీ: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఉద్దేశించిన ‘నేషనల్ సింగిల్ విండో సిస్టమ్’ పరిధిలోకి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రకటించింది. వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటుకు 2022 నవంబర్ 14 నాటికి 117 మంది ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది.
ఇందులో 36 దరఖాస్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఆంధప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, గోవా, ఉత్తరాఖండ్, చండీగఢ్ ఇందులో చేరాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి వాహనాల తుక్కు విధానం అమల్లోకి రావడం గమనార్హం. ఇతర రాష్ట్రాలను కూడా ఇందులో త్వరగా భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 11 రాష్ట్రాల పరిధిలో 84 ఆటేమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలను రాష్ట్రాల నియంత్రణలో ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు పేర్కొంది.
చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!