పీఎన్‌బీ స్కాం: నీరవ్‌ మోదీకి భారీ షాక్‌

UK High Court rejects Nirav Modi extradition plea - Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. మోదీని ఇండియాకు అప్పగించాలన్న వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి నీరవ్‌ చేసుకున్న లిఖిత పూర్వక అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది కోర్టు అధికారి తెలిపారు. ఈ అప్పగింత తీర్పుపై మోదీకి మరో అవకాశం ఉంది. చట్టం ప్రకారం అతను మరో ఐదు రోజుల్లోగా మౌఖికంగా అభ్యర్థన చేసుకోవచ్చు. ఒకవేల ఈ అభ్యర్థనను అంగీకరిస్తే విచారణ చేపడుతుంది, తిరస్కరిస్తే నీరవ్ భారత్‌కు రాక తప్పదని అధికారిక వర్గాల సమాచారం. 

నీరవ్ మోడీ మౌఖికంగా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అతను మౌఖికంగా అప్పీల్ చేస్తే అప్పీల్ ప్రొసీడింగ్స్ కు అనుగుణంగా మేం చర్యలు తీసుకుంటాం అని భారత అధికారుల తరఫున కోర్టులో వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) పేర్కొంది. తప్పుడు సమాచారంతో పీఎన్‌బీని నీరవ్‌ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అప్పటికే మోడి లండన్ కు పారిపోయాడు. నీరవ్ మోడీ రెండు సంవత్సరాల క్రితం 19 మార్చి 2019న అరెస్టు ఇంగ్లాండ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి నైరుతి లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్నారు. పీఎన్‌బీ బ్యాంకును రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఫిబ్రవరిలో వెలువరించిన విషయం తెలిసిందే. 

చదవండి: ఆర్థిక నేరగాళ్ల రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top