ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్‌ శంకర్‌

Uday Shankar elected as president of FICCI for 2020-21 - Sakshi

న్యూఢిల్లీ: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన అధ్యక్షుడిగా ఉదయ్‌ శంకర్‌ నియమితులయ్యారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఫిక్కీ తెలిపింది. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ ఎండీ సంగీతా రెడ్డి ఉన్నారు. ఈ నెల 11–14 తేదీల్లో జరగనున్న ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో శంకర్‌ బాధ్యతలు చేపడతారని ఫెడరేషన్‌ తెలిపింది. ది వాల్ట్‌ డిస్నీ కంపెనీకి ఏషియా పసిఫిక్‌ ప్రెసిడెంట్‌గా, స్టార్‌ అండ్‌ డిస్నీ ఇండియాకు చైర్మన్‌గా ఉదయ్‌ శంకర్‌ ఉన్నారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగానికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్‌ కావటం ఫిక్కీ చరిత్రలోనే తొలిసారి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top