కోటక్‌ మహీంద్రా సీఎండీగా ఉదయ్‌ కోటక్‌ రాజీనామా | Uday Kotak resigns as MD and CEO of Kotak Mahindra Bank | Sakshi
Sakshi News home page

కోటక్‌ మహీంద్రా సీఎండీగా ఉదయ్‌ కోటక్‌ రాజీనామా

Sep 2 2023 3:57 PM | Updated on Sep 2 2023 5:15 PM

Uday Kotak resigns as MD and CEO of Kotak Mahindra Bank - Sakshi

Uday Kotak resigns:  కొటాక్ మహీంద్రా బ్యాంక్ సీఎండీ ఉదయ్ కోటక్  రాజీనామా చేశారు. షెడ్యూల్ కంటే 3 నెలల ముందుగానే తన పదవికి రాజీనామా చేయడం వార్తల్లో నిలిచింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లోవెల్లడించింది. ఆయనను  బ్యాంక్ సీఎండీ బాధ్యతలనుంచి  వైదొలిగినట్టు  పేర్కొంది. ఈ రాజానామాను  బ్యాంక్ బోర్డు ఆమోదం మేరకు సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చిందని తెలిపింది. 

అటు సీఎండీగా స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్టు ఉదయ్‌ కోటక్‌ కూడా ట్విటర్‌లో వెల్లడించారు. విశ్వసనీయత , పారదర్శకత  ప్రాథమిక సిద్ధాంతాలతో తాము విశిష్ట సేవలందించామనీ,  లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించామని పేర్కొన్నారు. 1985లో రూ. 10వేల మొదలైన తమ ప్రస్తానం ఈరోజు దాదాపురూ. 300 కోట్లకు చేరిందన్నారు.  తమ సంస్థ సామాజిక , ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యవస్థాపకుడిగా, కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. (చిన్న రుణాలనుంచి..వరల్డ్‌ టాప్‌ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్‌ అంటే ఇది!)

చాలా కాలం క్రితం, JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి పేర్లు ఆర్థిక ప్రపంచంలో ఆధిపత్యం చూశాను . దేశంలో  అలాంటి సంస్థను సృష్టించాలని కలతోనే నేను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో 3 మంది ఉద్యోగులతో ప్రారంభించా. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగినన్నారు.వ్యవస్థాపకులు వెళ్ళిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వర్ధిల్లుతుందంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement