ఢాకాలో విడుదలైన టీవీఎస్‌ ఎన్ టోర్క్ 125 స్కూటర్‌ | TVS Ntorq 125 Race Edition launched in Bangladesh | Sakshi
Sakshi News home page

ఢాకాలో విడుదలైన టీవీఎస్‌ ఎన్ టోర్క్ 125 స్కూటర్‌

Aug 23 2021 3:55 PM | Updated on Aug 23 2021 4:19 PM

TVS Ntorq 125 Race Edition launched in Bangladesh - Sakshi

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ టీవీఎస్‌ మోటారు తన ఎన్ టోర్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లాంచ్‌​ చేసినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ స్కూటర్‌ మార్కెట్‌లో ఇదివరకెన్నడూలేని కొత్త ఫీచర్లను జోడించి మరీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఇంజిన్‌, స్మార్ట్‌ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలు, స్టయిలిష్‌ లుక్‌ దీని సొంతం. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో బ్లూటూత్‌ కనెక్టివిటీతో వస్తున్న మొట్టమొదటి స్కూటర్‌ ఇదే. భారతదేశంలో ఈ  టీవీఎస్‌ ఎన్ టోర్క్ 125 రేస్ ఎడిషన్ ధర రూ.80,325(ఎక్స్ షోరూమ్, ఇండియా).(చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!)

స్కూటర్‌ సెగ్మెంట్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీవీఎస్ అధునాతన 'స్మార్ట్జోనెక్ట్' టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో దీన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. 125 సీసీ ఇంజిన్ 9.4 పీఎస్‌ పవర్‌, 10.5ఎన్‌ ఎం టార్క్‌, బ్లూ టూత్‌ కనెక్టివిటీ  ప్రధాన పీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు కాలర్ఐడీ, పార్కింగ్ లోకేషన్‌ అసిస్టెంట్‌, ఫుల్లీ-డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ద్వారా నావిగేషన్ సహాయాన్ని అందిస్తుంది. షార్ప్‌ హెడ్‌ లాంప్‌, డే టైం రన్నింగ్‌ లైట్‌ లాంప్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ట్యాంప్‌, 12 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ లాంటి ఫీచర్లు, డ్యుయల్‌ టోన్ పెయింట్ వల్ల మొత్తం డిజైన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సేకన్లలో తాకగలదు అని సంస్థ పేర్కొంది ఈ కొత్త స్కూటర్ ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్ తో వస్తుంది. ఇందులో నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇన్-బిల్ట్ ల్యాప్-టైమర్, ఫోన్-బ్యాటరీ డిస్ ప్లే, చివరి పార్క్ చేసిన లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, స్ట్రీట్ అండ్ స్పోర్ట్ వంటి మల్టీ రైడ్ స్టాటిస్టిక్ మోడ్లతో సహా 55 ఫీచర్లను కలిగి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement