భారత్‌లో ట్రూకాలర్‌ కార్యాలయం | Truecaller opens its first exclusive India office in Bengaluru | Sakshi
Sakshi News home page

భారత్‌లో ట్రూకాలర్‌ కార్యాలయం

Mar 17 2023 6:12 AM | Updated on Mar 17 2023 6:12 AM

Truecaller opens its first exclusive India office in Bengaluru - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కాలర్‌ ఐడీ వెరిఫికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రూకాలర్‌ బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.  స్వీడన్‌కు వెలుపల ప్రత్యేకంగా కేంద్రాన్ని నెలకొల్పడం ఇదే తొలిసారి అని కంపెనీ ప్రకటించింది. అలాగే  సంస్థకు ఇది రెండవ అతిపెద్ద సెంటర్‌ కూడా.

30,443 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆఫీసులో 250 మంది సిబ్బంది వరకు పనిచేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. కొన్ని ఫీచర్లను తొలిసారిగా ఇక్కడి కస్టమర్లకు అందించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలను విస్తరించడానికి ట్రూకాలర్‌ ఈ సౌకర్యాన్ని ప్రాథమిక కేంద్రంగా ఉపయోగించాలని యోచిస్తోంది. ట్రూకాలర్‌కు 33.8 కోట్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. వీరిలో భారత్‌ నుంచి 24.6 కోట్ల మంది ఉండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement