అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా! | 7 Best Robots And AI Innovations In CES 2024 - Sakshi
Sakshi News home page

CES 2024: అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా!

Published Thu, Jan 11 2024 1:38 PM

Top 7 Best Robots in CES 2024 - Sakshi

లాస్ వేగాస్‌లో అట్టహాసంగా జరుగుతున్న 2024 సీఈఎస్ ఈవెంట్‌లో అత్యుత్తమ ఉత్పత్తులు కనివిందు చేస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో సాధారణ ఉత్పత్తులకంటే కూడా కొత్త టెక్నాలజీతో అబ్బురపరిచే గ్యాడ్జెట్స్, వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కథనంలో ఏఐ (AI) టెక్నాలజీ కలిగిన ఉత్తమ గాడ్జెట్‌లను గురించి వివరంగా తెలుసుకుందాం.

బల్లీ (BALLIE)
సీఈఎస్ వేదికపై కనిపించిన ఉత్తమ ఏఐ ఉత్పత్తులలో ఒకటి 'బల్లీ'. శామ్‌సంగ్ కంపెనీ లాంచ్ చేసిన ఈ గ్యాడ్జెట్ చూడటానికి చిన్న బాల్ మాదిరిగా ఉంటుంది. కానీ పనితీరులో మాత్రం దానికదే సాటి అని చెప్పాలి. నిజానికి ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్ అయినప్పటికీ.. ఇంట్లో చాలా పనులు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెల మీద, పైకప్పు మీద కూడా ప్రాజెక్ట్ చేయగల కెపాసిటీ కలిగిన బల్లీ.. ఈవెంట్‌లో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ గ్యాడ్జెట్ ధర, వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.


(Image credit: Future)

LG స్మార్ట్ హోమ్ ఏజెంట్
శామ్‌సంగ్‌ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోకుండా.. LG కంపెనీ కూడా ఓ స్మార్ట్ హోమ్ ఏజెంట్‌ను ఆవిష్కరించింది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఈ గ్యాడ్జెట్ ఒక స్మార్ట్ హబ్. ఇది ChatGPT వాయిస్‌తో కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీ మానసిక స్థితిని పర్యవేక్షించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఈ ఏఐ రోబోటిక్ ధర కూడా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.


(Image credit: LG)

సెగ్వే నవిమో (SEGWAY NAVIMOW)
సెగ్వే నవిమో అనేది ఓ రోబోట్ లాన్‌మూవర్స్. నిజానికి రోబోట్ లాన్‌మూవర్స్ ఈ రోజు ఆలోచన కాదు. అయితే సీఈఎస్ వేదికపై కనిపించిన ఈ సెగ్వే నవిమో ఏఐ టెక్నాలజీ కలిగిన గ్యాడ్జెట్. ఇది బ్లేడ్‌హాల్ట్ సెన్సార్, రెయిన్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, విజన్‌ఫెన్స్ సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అమెరికాలో ఈ గ్యాడ్జెట్ ధరలు అందుబాటులో లేదు కానీ.. యూరప్ మార్కెట్లో 1300 డాలర్ల ప్రారంభ ధర వద్ద లభిస్తోంది.


(Image credit: Segway)

ఓరో (ORO)
శామ్‌సంగ్, LG గ్యాడ్జెస్ట్స్ కంటే కూడా ఓరో అనేది పెంపుడు జంతువులకు మరింత ఫ్రెండ్లీగా ఉంటుంది.పెద్ద పెద్ద కళ్ళు కలిగిం ఈ పరికరం బంతిని విసరడం, ఆహారాన్ని అందించడం వంటివి చేసేలా రూపొందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటుంది. దీని ధర 799 డాలర్లు. ఏప్రిల్ నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఇప్పుడు దీనిని 299 డాలర్ల డౌన్‌పేమెంట్‌తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.


(Image credit: ORo)

మొబిన్ (MOBINN)
సాధారణంగా గ్యాడ్జెట్స్.. ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో చదునుగా ఉన్న ప్రాంతాల్లో తిరగటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మొబిన్ అనేది మెట్లను కూడా ఎక్కగలదు. ఫ్లెక్సిబుల్ వీల్స్‌తో కూడిన ఈ రోబోట్ మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. LiDAR-బేస్డ్ మ్యాపింగ్ సిస్టమ్‌ను కలిగిన మొబిన్ వర్షం, మంచు, రాత్రి సమయంలో కూడా పని చేస్తుంది. సంస్థ ఈ గ్యాడ్జెట్ ధర, లాంచ్ డేట్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు.


(Image credit: MOBINN)

లూనా (LOONA)
సాధారణంగా ఎవరైనా తమను ఎంటర్‌టైన్‌ చేయడానికి పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే లూనా అనే రోబోట్ పెంపుడు జంతువులకు ఏ మాత్రం తీసిపోదు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ChatGPT ఆధారంగా పనిచేస్తుంది. ఇది కదిలే హోమ్ మానిటర్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. దీని ధర 380 డాలర్ల వరకు ఉంటుంది.


(Image credit: keyirobot)

రోబోట్ వాక్యూమ్
రోబోట్ వాక్యూమ్ అనేది వాయిస్ అసిస్టెంట్, రోబోట్ ఆర్మ్, వీడియో కాలింగ్ ఫంక్షనాలిటీ వంటి వాటిని పొందుతుంది. CES 2024 వేదికగా కనిపించిన అద్భుతమైన గ్యాడ్జెట్లలో ఇది కూడా ఒకటి. మరొక పరికరం అవసరం లేకుండా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ పరికరం లోపల ఉండే కెమెరా యజమానికి కాల్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ రోబోట్ వాక్యూమ్ ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement