Stock Market Latest News: Sensex Tanks Further, Down 1000 pts, Nifty support At 17200 Today Stock Market Update - Sakshi
Sakshi News home page

Stock Market News: 'బేర్'మన్న మార్కెట్, 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

Apr 18 2022 9:43 AM | Updated on Apr 18 2022 12:47 PM

Today Stock Market Update - Sakshi

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై బేర్‌ పంజా విసిరిదింది. దీంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారంలో సుమారు 50కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. దీనికి తోడు దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు, ఉక్రెయిన్‌– రష్యా యుద్ధ పరిణామాల నుంచి దేశీయ మార్కెట్లుపై ప్రభావం చూపుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. 

నిపుణులు ఊహించినట్లే జరిగింది. జాతీయ, అంతర్జాతీయ అంశాల ప్రభావం దేశీయ మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో సోమవారం ఉదయం 9.39 నిమిషానికి సెన్సెక్స్‌ 1018పాయింట్లు నష్టపోయి 57320 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 264పాయింట్లు నష్టపోయి 17211 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.  

ఎన్టీపీసీ, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ,దివీస్‌ ల్యాబ్స్‌, కోల్‌ ఇండియా, మారుతీ సుజికీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా,హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, లార‍్సెన్‌, కొటక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

చదవండి: మీరు స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement