Gmail: అవి ఆటోమేటిక్‌గా డిలీట్‌ కావాలంటే

Tips To Manage Memory Space In Gmail - Sakshi

Gmail Storagefull Issue: ఇబ్బడిముబ్బడిగా వచ్చే ఈ మెయిల్స్‌, అవసరం తీరిపోయినా ఇన్‌బాక్స్‌లో అలాగే ఉండి పోయే ఈ మెయిల్స్‌తో జీమెయిల్‌ ప్రీ మెమెరీ స్పేస్‌ త్వరగా పూర్తయిపోయి ఇబ్బందులు పడుతున్నారా? అనవసరపు ఈ మెయిల్స్‌ ఆటోమేటిక్‌గా డిలిల్‌ అయితే బాగుండు అనుకుంటున్నారా?  అయితే జీ మెయిల్‌ ఆప్షన్స్‌లోకి వెళ్లి ఈ కమాండ్స్‌ ఇవ్వండి.. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఇన్‌బాక్స్‌ క్లీనింగ్‌
అవసరం ఉన్న ఇమెయిల్స్‌ సంగతి సరే, అక్కరలేనివి కూడా తరచుగా వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు డిలిట్‌ చేయాలనుకుంటాంగానీ మరిచిపోతుంటాం. దీని వల్ల వృథా స్థలంతో ఇన్‌బాక్స్‌ భారమైపోతుంది. ఇన్‌బాక్స్‌ క్లీన్‌ చేయడానికి, అక్కరలేని ఇమెయిల్స్‌ వాటికవే డిలిట్‌ కావడానికి ఈ స్టెప్స్‌ ఫాలో అవండి
- జీమెయిల్‌ ఓపెన్‌ చేయండి.

- సెర్చ్‌బార్‌లో కనిపించే ఫిల్టర్స్‌ ఐకాన్‌ను నొక్కండి
- టాప్‌లో కనిపించే ‘ఫ్రమ్‌’లో మీకు ముఖ్యం కాని పేరు లేదా ఇమెయిల్‌ అడ్రస్‌ను టైప్‌ చేయండి
- క్రియేట్‌ ఫిల్టర్‌ను క్లిక్‌ చేసి ‘డిలిట్‌ ఇట్‌’ను సెలెక్ట్‌ చేయండి
- మరోసారి అక్కడి పేజీలో క్రియేట్‌ ఫిల్టర్‌ను క్లిక్‌ చేయండి

చదవండి: జీమెయిల్‌ సరికొత్త రికార్డు..! ప్రపంచజనాభా కంటే ఎక్కువగా..!

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top