ఆ రంగంలో మూడు కోట్ల ఉద్యోగాలు - టాటా గ్రూప్‌ చైర్మన్‌

There Is A Huge Employment Opportunities In Digital Sector Said By N Chandrasekaran - Sakshi

భవిష్యత్తులో డిజిటల్‌ రంగం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు టాటా గ్రూపు చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌. విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగంల్లో డిజిటల్‌ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని  సెమికండర్లు, 5జీ ఎక్విప్‌మెంట్‌ తయారీలోకి టాటా అడుగుపెడుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్‌ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై జాతీయ మీడియాకు ఆయన వివరించిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి.

ఈ నాలుగే కీలకం
కరోనా తర్వాత పరిస్థితులూ పూర్తిగా మారిపోయాయి. జీవన విధానం మారిపోయింది, పని చేఏ తీరులో మార్పులు వచ్చాయి. వ్యాపారం కూడా రూపు మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో డిజిటలీకరణ, కొత్త రకం సప్లై చైయిన్‌, పర్యవరణానికి హానీ చేయకుండా అభివృద్ధి చెందడం ముఖ్యమైన అంశాలుగా మారబోతున్నాయి. వీటన్నింటీలో ఆరోగ్యం కాపాడుకోవడం ఓ అంతర్భాగంగా ఉంటుంది. ఈ నాలుగు అంశాల్లో వ్యాపార విస్తరణపై టాటా గ్రూపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో ఈ నాలుగు థీమ్‌లకు అనుగుణంగా భవిష్యత్‌ ప్రణాళికలు ఉంటాయి.

టేకోవర్లు 
డిజిటలీకరణ అని సింపుల్‌గా చెప్పుకున్నాం. కానీ  ప్రయాణాలు, రిటైల్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హెల్త్‌, ఎడ్యుకేషన్‌ ఇలా అన్నింటా డిజిటలైజ్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పని. ఈ రంగంలో విస్తరించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అవసరాలను బట్టి కొన్ని సంస్థలను కొనాల్సి రావచ్చు.
సెమికండక్టర్ల తయారీలో
ప్రస్తుతం ప్రపంచ వ్యా‍ప్తంగా సెమి కండక్టర్ల కొరత ఉంది. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్‌ ఉంటుంది. వ్యూహాత్మకంగా టాటా గ్రూపు సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలోకి అడడుగుపెడుతోంది. ఇప్పటి వరకు సెమికండక్టర్ల తయారీకి చాలా దేశాలు చైనాపై ఆధారపడేవి. ప్రపంచ వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు చైనాకు ప్రత్యామ్నయం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా వినియోగించుకోవాలి. అందుకే సెమికండక్టర్లు, 5జీ టెక్నాలజీ ఎక్విప్‌మెంట్‌ తయారీపై దృష్టి పెట్టాం.


3 కోట్ల ఉద్యోగాలు
కరోనా కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇవి సమసిపోవాలంటే విద్యా, వైద్య రంగంలో త్వరితగతిన మార్పులు జరగాల్సి ఉంది. ఈ రంగంలో డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్‌ తక్కువగా ఉన్న వారికి ఉద్యోగాలను కల్పించే వెసులుబాటు కలుగుతుంది.
హైబ్రిడ్‌తో
ఇంటి నుంచి, ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్‌ విధానం మరింత విస్త్రృతమైతే పదో తరగతి వరకు చదివిన గృహిణులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మా అంచనా ప్రకారం హైబ్రిడ్‌ పద్దతి సక్సెస్‌ అయితే 12 కోట్ల మంది మహిళలు ఇంటి నుంచే వివిధ ఉద్యోగాలు చేయగలుతారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి 440 బిలియన్‌ డాలర్లు సమకూరుతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top