టెస్లా ప్రియులకు గుడ్ న్యూస్!

Tesla looking to open showrooms in 3 cities in India - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశంలోని మూడు మహా నగరాల్లో షోరూమ్‌లను తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎక్కడైతే బాగుంటుందనే ప్రదేశాల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. దేశంలో తన వ్యాపారకలాపాలు విస్తరించడానికి ఒక ఎగ్జిక్యూటివ్‌ను నియమించినట్లు తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఇండియాలో వ్యాపారసేవలు కొనసాగించడానికి జనవరిలో స్థానికంగా సంస్థను నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2021 మధ్య నాటికి మోడల్ 3 సెడాన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తుంది. 

దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై, దక్షిణాదిన టెక్ సిటీ అయిన బెంగళూరులో షోరూమ్‌లు, సర్వీస్‌ సెంటర్లు తెరిచేందుకు టెస్లా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ మూడు నగరాలలో షోరూంలు తెరిచేందుకు 20,000 నుంచి 30,000 చదరపు అడుగుల వరకు ఉన్న వాణిజ్య భవనాల కోసం గాలిస్తున్నారు. టెస్లాకు అవసరమైన షోరూం స్థలాన్ని చూసిపెట్టే బాధ్యతను గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ గ్రూప్‌నకు అప్పగించినట్లు సమాచారం. ఈ సంస్థ గత కొన్ని వారాలుగా స్థలాలను సర్వే చేస్తున్నది. సంపన్న కస్టమర్లు సులభంగా వచ్చేలా చూసేందుకు షోరూంలకు స్థలాలను గుర్తించడంపై ఈ సంస్థ దృష్టి సారించింది.

చదవండి: ప్రతి నెల పదివేల పెన్షన్ కావాలా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top