పిల్లల కోసం అదిరిపోయే టెస్లా వెహికల్.. ధర ఎంతో తెలుసా?

Tesla Launches Cyberquad for Kids With 24 Km Range - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా నిశ్శబ్దంగా పిల్లల కోసం ఒక సరికొత్త ప్రొడ‌క్ట్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. సైబర్ క్వాడ్ ఫర్ కిడ్స్ అనే పేరుతో ఆల్ టెరైన్ వెహికల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. సరిగ్గా క్రిస్మస్ పండుగ సీజన్ ముందు దీనిని టెస్లా లాంచ్ చేయడం విశేషం. సైబర్ క్వాడ్ ఫర్ కిడ్స్ అనేది ఒక ఆల్ టెరైన్ వేహికల్(ఏటీవి). ఇది టెస్లా సైబర్ ట్రక్ డిజైన్ పోలి ఉంటుంది. సైబర్ క్వాడ్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 15 మైళ్ల(24 కిలోమీటర్లు) వరకు దూసుకెళ్తుంది. 

టెస్లా సైబర్ క్వాడ్
ఈ ఆల్ టెరైన్ వాహనాన్ని 8 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల పిల్లల కోసం డిజైన్ చేశారు. ఈ టెస్లా సైబర్ క్వాడ్ ఫర్ కిడ్స్ గంటకు 16 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. టెస్లా సైబర్ క్వాడ్ ఫర్ కిడ్స్ ధర $1,900 (సుమారు రూ.1,42,400)గా ఉంది. ఈ వాహనాన్ని టెస్లా పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సైబర్ క్వాడ్ ఫర్ కిడ్స్ 2-4 వారాల్లో డెలివరీ చేయనున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ ముందు భారీగా ఆర్డర్లు రావచ్చని టెస్లా పేర్కొంది. ఇది 68 కిలోగ్రాములు వరకు బరువు మోయగలదు. ఆఫ్ రోడ్ కోసం రియర్ డిస్క్ బ్రేకులను సర్దుబాటు చేయగల సస్పెన్షన్ కలిగి ఉంది. 

(చదవండి: చైనాతో కటీఫ్‌.. భారత్‌తో దోస్తీ!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top