
చవకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న జియో కస్టమర్లకు ఓ సూపర్‌హిట్ ప్లాన్ ఉంది. అదే రూ. 198 ప్లాన్. ఇది 14 రోజుల పాటు అపరిమిత 5జీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.
జియో రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు 14 రోజుల పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ప్రతిరోజూ 2 జీబీఆ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. అదనంగా జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ వంటి జియో సూట్ యాప్‌లకు యాక్సెస్‌ను ఆనందించవచ్చు.
రూ.198 ప్లాన్‌ను మైజియో యాప్ లేదా ప్రీపెయిడ్ సేవలను అందించే ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లో రీచార్జ్ చేసుకుంటే ఎటువంటి అదనపు రుసుములు ఉండవు. కానీ గూగుల్ పే, పేటీఎం లేదా ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 1 నుండి రూ. 3 వరకు అధిక రుసుము ఉంటుంది.