రిటైల్‌ విక్రయాల్లోకి సుగ్న స్టీల్స్‌ | Sugna Steels forays into retail sales | Sakshi
Sakshi News home page

రిటైల్‌ విక్రయాల్లోకి సుగ్న స్టీల్స్‌

Mar 29 2023 6:35 AM | Updated on Mar 29 2023 6:35 AM

Sugna Steels forays into retail sales - Sakshi

హైదరాబాద్‌: చిన్న నిర్మాణాలకు కూడా ఫ్యాక్టరీ ధరలకే స్టీల్‌ను అందించే ఉద్దేశంతో సుగ్న మెటల్స్‌ సంస్థ రిటైల్‌ విక్రయాల్లోకి ప్రవేశించింది. రోహిత్‌ స్టీల్స్‌తో కలిసి హైదరాబాద్‌లో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. 8 ఎం.ఎం. మొదలుకుని 32 ఎంఎం వరకు వివిధ ఉక్కు ఉత్పత్తులను ఎన్ని టన్నులైనా ఈ స్టోర్‌ నుంచి కొనుగోలు చేయొచ్చని సుగ్నా చైర్మన్‌ భరత్‌ కుమార్‌ అగ్రవాల్‌ తెలిపారు.

గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సహా దక్షిణాదిలో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ నిర్మాణాలకు టీఎంటీ స్టీల్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పరిగిలోని తమ సొంత ప్లాంటులో రోజుకు 1,300 టన్నుల ఉక్కును ఉత్పత్తి కంపెనీ సేల్స్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ జైన్‌ తెలిపారు. తమ ఉత్పత్తుల రిటైల్, హోల్‌సేల్‌ పంపిణీ కోసం ఎక్స్‌క్లూజివ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌గా రోహిత్‌ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement