సాక్షి మనీ మంత్ర: ఫెడ్‌ మీటింగ్‌.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫెడ్‌ మీటింగ్‌.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Mar 19 2024 9:32 AM | Updated on Mar 19 2024 9:32 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 113 పాయింట్లు నష్టపోయి 21,944కు చేరింది. సెన్సెక్స్‌ 351 పాయింట్లు దిగజారి 72,399 వద్ద ట్రేడవుతోంది.

క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87.01 అమెరికన్‌ డాలర్ల వద్దకు చేరింది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 103.59 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లోకి వెళ్లాయి. ఎస్‌పీఎక్స్‌ 0.63 శాతం, నాస్‌డాక్‌ 0.82 శాతం పెరిగాయి.

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్‌ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(మార్చి 19), బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement