సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Mar 14 2024 9:41 AM | Updated on Mar 14 2024 11:23 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 22,002కు చేరింది. సెన్సెక్స్‌ 44 పాయింట్లు నష్టపోయి 72,698 వద్ద ట్రేడవుతోంది.

డాలర్‌ ఇండెక్స్‌ 102.77 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 84.01 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. కాపర్‌ ధరలు 11 నెలల గరిష్ఠాన్ని తాకాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్‌పీఎక్స్‌ 0.19 శాతం, నాస్‌డాక్‌ 0.54 శాతం నష్టపోయాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ లాభాల్లోకి చేరుకున్నాయి. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాన్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్లాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement