సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌లపై బేర్‌ పంజా | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌లపై బేర్‌ పంజా

Mar 26 2024 3:31 PM | Updated on Mar 26 2024 4:58 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 22,020 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 357 పాయింట్లు దిగజారి 72,473 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎల్‌ అండ్‌టీ, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రాబ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, హెచ్‌యూఎల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement