
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సోమవారం సెషన్‌ను నష్టాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15 శాతం) క్షీణించి 73,085.94 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,649.72 - 72,784.54 రేంజ్‌లో ట్రేడ్ అయింది.
నిఫ్టీ 50 కేవలం 5.40 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 22,119.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 22,261 వద్ద, రోజు కనిష్ట స్థాయి 22,004 వద్ద నమోదయ్యాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.14 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ సోమవారం 0.27 శాతం నష్టపోయింది.
భారత్ ఎలక్ట్రానిక్స్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 4.65 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ 50లోని 50 షేర్లలో 33 షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశపు అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.17 శాతం క్షీణించింది.
నిఫ్టీ 50లో కోల్ ఇండియా, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 2.44 శాతం వరకు నష్టపోయాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ సూచీలు 1.26 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా సూచీలు 1.10 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి.